సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-2కు సిఎం శంకుస్థాపన

Hon’ble CM of AP Laying Foundation Stone Virtually for Somasila High Level Canal Phase-2

అమరావతి: సిఎం జగన్‌ సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్-‌2కు శంకుస్థాపన చేశారు. కాగా సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్- 1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్‌2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం​ చేస్తున్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/