మైగ్రెయిన్ నివారణ మార్గాలు

ఆరోగ్య పరిరక్షణ

చాలా మంది మహిళల్లో భరించలేని మైగ్రెయిన్ నొప్పి వస్తూ ఉంటుంది.. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోక పోవటం వలన కూడా ఈ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


ఆకు కూరలు:

ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలు, శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.. వీటిలోని మెగ్నీషియం, విటమిన్ బి, మైగ్రెయిన్ ను తగ్గిస్తాయి.. పచ్చగా వున్నా కూరగాయలు తినటం వలన మరహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు మెరుగుపడి తలనొప్పి దూరం అవుతుంది.

నీరు తాగటం:

డీహైడ్రాషన్ కారణంగా మైగ్రెయిన్ కనిపిస్తుంది.. తగినంత నీరు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పుట్ట గొడుగులు:

మైగ్రెయిన్ ను ఎదుర్కొనడంలో పుట్ట గొడుగులు ఉపయోగ పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్ట గొడుగు, గుడ్లు, నట్స్ వంటి ఆహార పధార్ధాలతో రోబో ఫ్లావిన్ అధికంగా ఉంటుంది.. ఇది తలనొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాల కోసం ‘నాడి’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health1/