పిల్లలకు నచ్చేలా ఇంట్లోనే చిరుతిళ్లు ..

చిన్నారుల ఆహారం-పోషణ

ఒకపుడు హోటల్ కి వెళ్తేనే బయట తిండి.. అదీ పెద్దలతో కలిసి వెళ్తేనే కుదిరేది.. కానీ ఇపుడో, స్కూల్ పిల్లలు కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు.. ఇలా అరుదుగా అయితే పర్వాలేదు.. కానీ తరచుగా తింటే మాత్రం డబ్బుకు రెక్కలొస్తాయి.. అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యం పాడవుతుంది.. ఇంతా చేస్తే అవేమైనా అద్భుతమైన రుచుల ఆంటే కాదు.. మనకు అంతకంటే నోరూరించే వంటకాలెన్నో ఉన్నాయి . పైగా అవి శరీరానికి హాని చేయవు.. అయినా వాటికోసం వెంపర్లాట ఎందుకు?… ఇకపైనా పిల్లల నాడి గ్రహించి ఇలా చేసి చూడండి. …

నీళ్లు కలపని చిక్కటి దోషాల పిండిలో ఉల్లి, మిర్చి ముక్కలు , కాస్త అల్లం ముద్ద వేసి సన్న సెగలో ఊతప్పం వేసి ముక్కలుగా కోయండి…టొమాటో , ఉల్లి, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికం, కొత్తిమీర వంటివి సన్నగా తరిగి పైన పేర్చనుంది.. టమాటో సాస్,, చిల్లీ సాస్ కొద్దిగా వేసి ఇచ్చారంటే క్షణాల్లో తినటమే కాదు పిజ్జా దీనిముందు బలాదూర్ అనేస్తారు చిచ్చర పిడుగులు..

జపాన్ వాళ్ళ రైస్ బాల్స్ అంటే పిల్లలకు నోట్లో నీళ్లూరతాయి. వీటిల్లో ఒకరకంలో అన్నన్ని ఉండలుగా చేసి నువ్వులూ, గట్రా అద్ది అలాగే తినేస్తే ఇంకో రకంలో వేయించి క్రిసీగా చేస్తారు.. మొదటిది నువున్నాం, జీరా రైస్ తరహాదే.. రెండోది కచోరీని తలపిస్తుంది.. ఇలాంటివి, ఇంతకంటే రుచికరమైనవీ అనేకమున్న, మనం గార్నిష్ జోలికి వెళ్ళాం… కానీ చిన్నారులు దానికీ ముచ్చట పడుతున్నారని అర్ధమైంది కనుక ఆకర్షణీయమైన రంగులతో అలంకరిస్తే పోలా !…

మనలో చాలామంది కేక్ ఇంట్లోనే తయారు చేస్తుంటాం కదా.. కానీ పిల్లలకు బేకరీల్లో కొన్న కేకులే నచ్చుతాయి.. అందుకు ముఖ్య కారణం అలంకరణే.. అందుకే రుచిగా వున్నా సారీ ప్లేన్ గా వదిలేయకుండా చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ లాంటివి అందంగా అమరిస్తే ఆహా అంటూ తింటారు..

చిరుతిళ్ళు చేసేంత సమయం లేనపుడు పండ్లు తీసుకోండి.. ఒకే రకం కాకుండా ద్రాక్ష, ఆపిల్, కివీ , చెర్రీస్ , అరటి పండు, నల్ల ద్రాక్ష, బొప్పాయి ..ఇలా ప్లేటులో సర్ది ఇస్తే రంగురంగుల్లో అలరిస్తూ పిల్లలకు నచ్చేలా ఉంటాయి.. వీలయితే వాటిని కూడా పొడవైన ముక్కలు, చతురస్తం, త్రిభుజం, ఆలా వివిధ ఆకృతుల్లో కోసి పెడితే వహ్వా అంటూ పిల్లలు ఎంచక్కా తినేస్తారు.

‘నాడి ‘ (ఆరోగ్యం సంబంధిత విషయాల కోసం): https://www.vaartha.com/specials/health1/