పనీర్‌ గ్రేవీ

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Paneer Gravy

కావలసినవి:

పనీర్‌- 200 గ్రా. ఉల్లిపాయలు, టమాటాలు-నాలుగు చొప్పునఅల్లం, వెల్లుల్లి ముద్ద -చెంచా, వేరు శనగలు-మూడు చెంచాలు(వేయించి పొడిచేయాలి).

పచ్చిమిర్చి ముక్కలు-చెంచా, జీలకర్ర, ధనియాలపొడి-చెంచా చొప్పున, కొబ్బరిపాలు-కప్పు ఉప్పు, కారం-రుచికి తగినంత, పసుపు-చిటికెడు నూనె – మూడు చెంచాలు , కొత్తిమీర తరుగు-కొద్దిగా

తయారుచేసే విధానం

రెండు ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో మెత్తగా చేయాలి. మిగతా రెండింటినీ సన్నగా తరగాలి. టమాటాలను కడిగి ప్యూరీ తయారుచేయాలి.

ఇప్పడు మందపాటి అడుగున్న పాత్రలో నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అందులో ఉప్పు, పనీర్‌ముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక నీళ్లు వంపి పక్కనపెట్టాలి.

బాణలిలో నూనె వేడిచేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.

ఆ తరువాత ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి మిశ్రమం చేర్చాలి. రెండు నిమిషాలయ్యాక టమాట గుజ్జు కలపాలి.

నూనె పైకి తేలాక ధనియాలపొడి, శనగపొడి, కొబ్బరిపాలు, పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు నీళ్లు వేసి మూతపెట్టాలి.

గ్రేవీ తయారయ్యాక ఉడికించిన పనీర్‌ ముక్కలు వేయాలి. ఐదు నిమషాలయ్యాక కొత్తిమీర చల్లి దించి వేడివేడిగా వడ్డించండి. ఇది చపాతీల్లోకి కూడా బాగుంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/