యోగా తో సంగీతం మేళవింపు

మానసిక వికాసం

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గణ రసం ఫణి: అన్నారు పెద్దలు ఆంటీ ప్రతి జీవి కూడా, సంగీతానికి పరవశించి మంత్రం ముగ్ధులై పోతారు.. అందుకే సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని అంటారు.. యోగ శారీరక ఆరోగ్యాన్నిప్రసాదిస్తే సంగీతం మానసిక ఆనందాన్ని ఇస్తుంది..

యోగా, సంగీతం రెండూ కూడా మనిషి శరీరంపై, మనస్సుపై ఏంటో గొప్పగా ప్రభావాన్ని చూపుతో అన్ని రకాల ఒత్తిడులను బాధలను , కష్టాలను మైమరపించి మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి.. మనకి నచ్చిన మ్యూజిక్ వింటూ యోగాసనాలు వేస్తె ఒత్తిళ్ల నుంచి 100 శాతం దూరంగా ఉండవచ్చు.. మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది..

అలాగే, వివిధ రకాల భంగిమలతో శరీరాన్ని కదిలిస్తూ క్రమం తప్పకుండా యోగాసనాలు చేస్తే శరీరంలో కొవ్వును కరిగించి ఆరోగ్యవంతంగా వుండే మహత్తర శక్తి యోగాది.. పనులు చేసుకునే పల్లె ప్రజలు పాటలు పాడుతూ సంగీతం వింటూ సేద తీరుతారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చేసే పట్టాన జనాలు రోజూ యోగ సాధన ద్వారా అధిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వవచ్చు.. ఇలా మానవ జాతి మనుగడకు , వికాసానికి పరిపూర్ణ ఆరోగ్యానికి వందల ఏళ్ళ నుంచి తోడ్పడుతున్న తారక మంత్రాలు సంగీతం, యోగా .

మరిన్ని ఆరోగ్య సంబంధిత వ్యాసాల కోసం ‘నాడి ‘ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health1/