నారా లోకేశ్ కాన్వాయ్‌లో పోలీసుల తనిఖీలు

ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కారు ను పోలీసులు తనిఖీలు చేసారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న లోకేశ్ కాన్వాయ్‌లోని అన్ని కార్లను పోలీసులు తనిఖీ చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే తనిఖీ చేస్తున్నట్టు లోకేశ్‌కు పోలీసులు తెలిపారు. దీంతో లోకేశ్ వారికి సహకరించారు. మొత్తం అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు లేకపోవడంతో కాన్వాయ్‌ని వదిలిపెట్టారు. ఏపీలో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్ని పార్టీలు తమ తమ ప్రచారంలో బిజీ అవుతున్నాయి.