దేశ చ‌రిత్ర‌లో ఇదో కొత్త అధ్యాయం: ప్ర‌ధాని

PM Modi’s address to the nation

న్యూఢిల్లీ: నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉద్దేశించి ప్ర‌సంగించారు. అక్టోబ‌ర్ 21వ తేదీన దేశంలో కోవిడ్ టీకా పంపిణీ విష‌యంలో వంద కోట్ల మార్క్‌ను అందుకున్న‌ట్లు మోడీ తెలిపారు. ఈ ఘ‌న‌త దేశంలోని ప్ర‌తి ఒక పౌరుడికి చెందుతుంద‌న్నారు. ఈ మార్క్‌ను అందుకున్న నేప‌థ్యంలో ప్ర‌తి పౌరుడికి కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని అన్నారు. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే కాదు అని, దేశ చ‌రిత్ర‌లో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. క‌ఠిన ప‌రిస్థితుల్లో ఇండియా ఓ ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా చేరుకున్న‌ట్లు చెప్పారు. ల‌క్ష్యాల కోసం దేశం క‌ఠినంగా ప‌నిచేస్తుంద‌న్న సంకేతాన్ని చెబుతుంద‌న్నారు. ఇది భార‌త సామ‌ర్ధ్యానికి ప్ర‌తిబింబంగా నిలుస్తుంద‌న్నారు. కొత్త ఇండియా ఇమేజ్‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు. బిలియ‌న్‌ వ్యాక్సిన్ డోసుల పంపిణీలో వీఐపీ క‌ల్చ‌ర్ చోటుచేసుకోలేద‌న్నారు.

వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై మొద‌ట్లో చాలా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయ‌ని, ఇండియా లాంటి దేశంలో వ్యాక్సిన్ క్ర‌మ‌శిక్ష‌ణ ఎలా సాధ్యం అవుతుంద‌ని విమ‌ర్శించార‌న్నారు. స‌బ్‌కా సాత్‌.. స‌బ్ కా వికాశ్‌కు ఇండియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ స‌జీవ ఉదాహ‌ర‌ణ అన్నారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై వీఐపీ క‌ల్చ‌ర్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌ర్నీ స‌మంగా చూశామ‌న్నారు. దేశంలో జ‌రిగిన వ్యాక్సినేష‌న్ విధానంపై గ‌ర్వంగా ఫీల‌వ్వాల‌ని, శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో.. శాస్త్రీయ ఆధారంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగ‌నిట్లు ప్ర‌ధాని తెలిపారు. సంపూర్ణంగా సైంటిఫిక్ ప‌ద్ధ‌తుల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

పెద్ద దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానిక ప్ర‌జ‌లు ముందుకు రావ‌డం లేదు. కానీ మ‌నం ఇప్ప‌టికే 100 కోట్ల డోసుల‌ను దాటేశాం. నిన్న‌ మ‌నం చ‌ర‌త్రి సృష్టించాం అని చెప్ప‌డానికి సంతోషప‌డుతున్నా. ఈ విజ‌యం మ‌న అంద‌రిదీ. భార‌త్ శ‌క్తి ఏంటో క‌రోనా వ్యాక్సిన్‌తో ప్ర‌పంచ దేశాలు చూశాయి. ఇంత పెద్ద దేశానికి టీకాల స‌ప్ల‌య్ అనేది సాధార‌ణ విష‌యం కాదు. వంద కోట్ల డోసులు అనేది ముఖ్యం కాదు.. దేశ ప్ర‌జ‌ల న‌మ్మ‌కం అని ప్ర‌ధాని మోడీ అన్నారు. అయితే కరోనా ఇంకా కట్టడి కాలేదు. నిబంధనలు పాటించాల్సిందే. పండుగ రోజుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అని జాతినుద్దేశించి ప్రధాని మోడీ అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/