నూతన సచివాలయం అద్భుతం – బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌

తెలంగాణ నూతన సచివాలయం అద్భుతం అన్నారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయాన్ని విజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పద్దతులను ప్రశంసించారు. భావితరాలకు దిక్సూచిగా సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ముందు చూపుతో అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అతి తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో సచివాలయాన్ని నిర్మించారని అన్నారు.

ఇక పాత సచివాలయం దగ్గర పార్కింగ్ స్థలం సరిగ్గా లేకపోవడం, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో సౌకర్యాల లేమి, ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు-వీడియో కాన్ఫరెన్స్ హాళ్ళు లేకపోడం, అధికారులు ఇతర సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడానికి అనువుగా లేకపోవడం, ఫైళ్ళ తరలింపులో ఇబ్బందులు ఎదురవడం, నేషనల్ బిల్డింగ్ – గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు లేకపోవడం, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినపుడు బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో ఉండడం వంటి కారణాలలో తెలంగాణ ప్రభుత్వం ఈ భవన సముదాయాన్ని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక కొత్త కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా, తెలంగాణకే తలమానికంగా ఉండేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సమీకృత సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది.