రాయ్‌గ‌ఢ్ ప్రమాదంపై ప్రధాని మోడి దిగ్భ్రాంతి

pm modi

ముంబయి: ప్రధాని నరేంద్రమోడి మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌గ‌ఢ్ జిల్లాలో సంభవించిన భ‌వ‌న ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద వార్త త‌న‌ను క‌ల‌చివేసిందంటూ ఆయ‌న ట్విట్ట‌ర్‌ల‌ ఆవేద‌న వెలిబుచ్చారు. మృతుల కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారంద‌రూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ప్ర‌మాద స్థలంలో జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ బ‌ల‌గాలు (ఎన్‌డీఆర్ఎఫ్‌), స్థానిక అధికారులు సంయుక్తంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని, భాధితుల‌కు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/