రాయ్‌గఢ్‌లో కొనసాగతున్న సహాయక చర్యలు
శిథిలాల కింద మరో 30 మంది

ముంబయి: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం నిన్న ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇప్పటి వరకు 60 మందిని రక్షించగా, ఇంకా 30 మంది వరకు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాయపడిన వారిని ముంబై ఆసుపత్రికి తరలించారు.
భవనం కూలిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు అదితి తాట్కరే, ఏక్‌నాథ్ షిండేలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటి వరకు 60 మందిని రక్షించామని, మరో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, కూలిన భవనంలో 45 వరకు కుటుంబాలు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారనేది కచ్చితంగా తెలియరాలేదు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/