బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడి చర్చ

కరోనా కట్టడిలో మరింతగా పనిచేయాలన్న గేట్స్

PM-Modi-video conference-With-Bill-Gates

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు జరిపారు. కరోనా కట్టడి, దేశాల మధ్య పరస్పర సహకారం తదితర అంశాలను మోడి చర్చించారు. కరోనా కట్టడి, దేశాల మధ్య పరస్పర సహకారం తదితర చర్చించారు. కాగా మహమ్మారిని ఎదుర్కొనేలా ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో ఇండియానూ భాగస్వామ్యం చేయాలని ప్రధాని మోడి సూచించారు. కలసి పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఇరువురూ అభిప్రాయపడ్డారు.


భారత్‌లో అనుసరిస్తున్న వ్యూహాలను గురించి తదుపరి వైరస్ కట్టిడి ప్రణాళికల గురించి వివరించారు. తమ దేశంలో ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడుతున్నామని వ్యాఖ్యానించిన మోడి, భౌతికదూరం, పరిశుభ్రత, మాస్క్ లు ధరించడం వంటి చర్యల్లో ప్రజల భాగస్వామ్యాన్ని తెలియజేశారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులను సముచితంగా గౌరవిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచేలా అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని మోడి వివరించారు.

ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ, ఇండియా మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో కరోనా చూపించే మార్పులను ముందుగానే విశ్లేషించి, ప్రజలకు మార్గదర్శనం చేయడంలో గేట్స్ ఫౌండేషన్ చొరవ చూపించాలని మోడి కోరారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని నిలువరించేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా మోడి ప్రశంసించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/