కార్పొరేటర్లు, మంత్రులతో కెటిఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: నేడు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ ఎన్నిక సందర్భంగా కొద్దిసేపట్లో టిఆర్‌ఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కార్పొరేటర్లు, నగర పరిధిలోని మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే నగరానికి చెందిన ఎక్స్‌అఫిషియో సభ్యులతో భేటీకానున్నారు. సమావేశంలో పార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నారు. మేయర్‌ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని కెటిఆర్‌‌ వివరించనున్నారు. సమావేశం అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. మేయర్‌ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30గంటలకు ఎన్నిక జరుగనుంది. డిసెంబర్‌లో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 56 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ గెలిచింది. బిజెపి 47, కాంగ్రెస్‌ 2, ఎంఐఎం 44 కార్పొరేటర్‌ స్థానాల్లో గెలుపొందాయి. టిఆర్‌ఎస్‌కు 32 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా.. ఎంఐఎంకు 10, బిజెపికి ఇద్దరు ఉన్నారు.