ఆసుపత్రిలో చేరిన మంత్రి సబిత

ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు..అర్ధరాత్రి ఛాతినొప్పి బంజారాహిల్స్‌ లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స

sabitha indra reddy
sabitha indra reddy

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గత అర్ధరాత్రి ఛాతినొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌ లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి తరలివెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో విద్యా శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆరోగ్యంపై విద్యా శాఖ ప్రకటన.

‘సబితా ఇంద్రారెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. సబిత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రికి వెళ్లారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్‌లు నార్మల్‌గానే వచ్చాయి. మరి కొద్ది సేపట్లో డిశ్చార్జ్అ వుతారని పేర్కొంది’.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/