భారత్‌లో కొత్తగా 92,071 ‌కేసులు

మొత్తం కేసులు సంఖ్య 48,46,428..మొత్తం మృతుల సంఖ్య 79,722

corona virus-india

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 92,071 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 48లక్షల మార్క్‌ను దాటింది. దేశంలో కేసుల సంఖ్య 48,46,428కు చేరాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 37,80,108 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. వైరస్‌ ప్రభావంతో గడిచిన 24గంటల్లో మరో 1,136 మంది మరణించగా.. ఇప్పటి వరకు 79,722 మంది మృత్యువాతపడ్డారని వివరించింది. ఇప్పటి వరకు 5,72,39,428 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/