ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇవేనట

పెట్రోల్ ధరలకు భయపడి సామాన్య ప్రజలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య వరుసగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ప్రమాదానికి గురి కావడం..ఛార్జింగ్ బ్యాటర్లు పేలిపోవడం , వాహనాల నుండి పొగలు , మంటలు రావడం వంటి సంఘటనలు జరిగి , పలువురి ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నివేదిక కోరుతూ కమిటీ వేసింది. ఇటీవ‌ల కాలంలో ప్ర‌మాదానికి గురైన వివిధ కంపెనీల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల నుంచి శాంపిల్స్‌ను సేక‌రించిన ఈ క‌మిటీ వాటిపై ద‌ర్యాప్తు చేసింది. దీని ఆధారంగా క‌మిటీ ఒక ప్రాథ‌మిక నివేదిక‌ను విడుద‌ల చేసింది.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అగ్ని ప్ర‌మాదానికి గురికావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ్యాట‌రీ సెల్స్‌, మ్యాడ్యుల్స్‌లో లోపాలు అత‌ని ఉన్న‌త‌స్థాయి క‌మిటీ అధ్య‌య‌నంలో ప్రాథ‌మికంగా వెల్ల‌డైంది. ఒకినావా కంపెనీకి చెందిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ప్ర‌మాదానికి బ్యాట‌రీ సెల్స్‌, మ్యాడ్యుల్స్ కార‌ణ‌మ‌ని పేర్కోగా, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సంబంధించి బ్యాట‌రీ కేసింగ్‌లో లోపాలు ఉన్న‌ట్లు గుర్తించింది. అదే విధంగా విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు సంబంధించి బ్యాట‌రీ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌లో లోపాలు ఉన్న‌ట్లు క‌మిటీ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఐసోలేటెడ్ థ‌ర్మ‌ల్ ఇష్యూ కార‌ణంగా ఓలా స్కూట‌ర్లు అగ్ని ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. మరికొన్ని కారణాలు తెలియాల్సి ఉంది.