‘కరోనా రెండో దశ కట్టడికి అవసరమైన చర్యలు’
‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ

New Delhi: దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’లో మాట్లాదారు. కరోనా మొదటి దశను విజయవంతంగా ఎదుర్కోగలిగామని, ఇపుడు రెండో దశ విజృంభణ ను కట్టడి చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యులకు ప్రధాని సూచించారు. . ఆయా రాష్ట్రాల్లో కరోనా నిర్మూలనకు తాము పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. కరోనాపై పోరులో వైద్య ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, నర్సులు, అంబులెన్సు డ్రైవర్ల నిరంతరం కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/