ప్ర‌ధాని మోడీ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని మోడీ ఓబీసీ క్యాట‌గిరీలో జ‌న్మించ‌లేదు.. గుజ‌రాత్‌లోని తేలి కులంలో జ‌న్మించారు..

‘PM Modi belongs to general category, he lied about caste’, alleges Rahul Gandhi

న్యూఢిల్లీః కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కులంపై కీలక వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడ‌లో రాహుల్ మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీ ఓబీసీ క్యాట‌గిరీలో జ‌న్మించ‌లేద‌ని, గుజ‌రాత్‌లోని తేలి కులంలో ఆయ‌న జ‌న్మించార‌ని చెప్పారు. 2000 సంవత్స‌రంలో ఆ కులాన్ని బిజెపి ఓబీసీ క్యాట‌గిరీలో చేర్చింద‌ని అన్నారు. మోడీ సాధార‌ణ కులంలోనే జ‌న్మించార‌ని, స్వ‌త‌హాగా ఓబీసీ కాద‌ని రాహుల్ ఆరోపించారు. మోడీ ఓబీసీగా జ‌న్మించ‌నందునే ఆయ‌న త‌న జీవితాంతం కుల‌గ‌ణ‌న నిర్వ‌హించేందుకు అనుమ‌తించర‌ని అన్నారు.

ఇక రాహుల్ యాత్ర గురువారం ఒడిషా నుంచి చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లోకి ప్ర‌వేశించ‌నుంది. ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌క కాంగ్రెస్ ఓట‌మి పాలైన అనంత‌రం రాహుల్ తొలిసారిగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్ట‌నున్నారు. ఇక రాహుల్ యాత్ర రాయ్‌ఘ‌ఢ్‌, కోర్బా జిల్లాల మీదుగా సాగుతూ ఫిబ్ర‌వ‌రి 14న బ‌ల్‌రాంపూర్ నుంచి జార్ఖండ్‌లోకి ప్ర‌వేశిస్తుంది.