సర్కారు వారి సక్సెస్ మీట్ లో స్టేజ్ ఫై మహేష్ మాస్ స్టెప్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ సర్కారు వారి పాట. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో మంచి కలెక్షన్లు రాబడుతుండడం తో చిత్ర యూనిట్ ఈరోజు సోమవారం కర్నూలులో సక్సెస్ మీట్ ఏర్పటు చేసింది.
ఈ సక్సెస్ మీట్ లో మహేశ్ బాబుతో సహా టీమ్ మొత్తం హాజరైంది. ఇక స్టేజ్‌పై డాన్సర్స్ ‘మ మ మహేషా’ సాంగ్‌కి డాన్స్ చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వారితో కలిసి స్టెప్పులేసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత సడెన్‌గా మహేష్ కూడా స్టేజ్ పైకి వెళ్లారు. తన మాస్ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు. మహేశ్.. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో స్టేజ్ ఎక్కి ఇలా డాన్స్ ఎప్పుడూ చేసినట్టు కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. View this post on Instagram
A post shared by GMB Entertainment (@gmbents)