కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు

ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీను

ap-high-court-grants-bail-to-kodi-kathi-srinu

అమరావతిః గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఈరోజు తీర్పును వెలువరించింది. గత ఐదేళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసింది. గత ఐదేళ్ల కాలంలో సాక్షం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరుకాకపోవడం గమనార్హం.

మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. వారానికి ఒక రోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌరహక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.