పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

పెద్దపల్లి: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విడివిడిగా కౌంటింగ్ చేపట్టారు. అందులో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను దగ్గరుండి జిల్లా కలెక్టర్ దేవసేన పరిశీలిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని రామగుండం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే చందర్ రావడంపై విపక్ష కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. విపక్షాల అభ్యంతరంతో కౌంటింగ్ కేంద్రం నుంచి ఎమ్మెల్యే చందర్ బయటకు వచ్చేశారు. జిల్లాలో మొత్తం 36 వార్డుల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతోంది. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/