సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు

తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు రేపు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గురువారం మినహా ఇతర రోజుల్లో వందేభారత్ రైలు సర్వీసులు అందించనున్నది.

విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు కొత్త వందే భారత్ ట్రైన్ మార్చి 13 నుండి ప్రారంభం కానుండగా.. తిరుగు ప్రయాణంలోనూ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు 15 వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి. వీటికి టిక్కెట్ల బుకింగ్స్ మార్చి 12 నుండి అందుబాటులోఉంటాయి. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుండి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అటువైపు నుంచి రైలు నంబర్ 20708 విశాఖ నుంచి వందేభారత్ రైలు 14.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.