భీంగల్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన టిఆర్‌ఎస్‌

Telangana Rashtra Samithi
Telangana Rashtra Samithi

నిజామాబాద్‌: మునిసిపల్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే దాదాపు అన్ని మునిసిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటుతోంది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం 12 వార్డులకు గాను.. ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 11 వార్డులను టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పటికే వర్దన్నపేట, సత్తుపల్లి మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సంగారెడ్డి జిల్లా బొల్లారంలో
ఛైర్ పర్సన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బొల్లారంలో కౌంటింగ్ పూర్తి అయ్యింది. మొత్తం 22 వార్డుల్లో టీఆర్ఎస్ 17 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ రెండు వార్డుల్లో, బీజేపీ మూడు వార్డుల్లో గెలుపొందింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/