ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాః మంత్రి కొండా సురేఖ!

Will participate in AP election campaign: Minister Konda Surekha

హైదరాబాద్‌ః ఏపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో అహంకారం కనిపిస్తుంది.ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు. కవిత పూలే విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. బీసీ లపై అంత ప్రేమ ఉంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటిఆర్ ను తొలగించి బీసీకి ఆ పదవీ ఇవ్వాలి అన్నారు.

ఏపీ ఎన్నికల ప్రచారం గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. నేను వైఎస్‌ఆర్‌సిపి లో లేను కాబట్టి కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తాను. ఏపీ లో ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా ప్రచారంకు వెళ్తాను అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గతంలో వైఎస్ జగన్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు కొండా సురేఖ. తెలంగాణలో వైఎస్‌ఆర్‌సిపి అంతగా లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.