వర్ధన్నపేటలో టిఆర్‌ఎస్‌ సంబరాలు

trs
trs

వరంగల్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు వర్ధనపేటలో టిఆర్‌ఎస్‌ గెలుపు సాధించింది. మొత్తం 12 వార్డుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. 2 వార్డుల్లో కాంగ్రెస్ సభ్యులు గెలవగా.. బిజెపి 1, స్వతంత్రులు 1 వార్డు గెలిచారు. అత్యధిక వార్డులు కైవసం చేసుకోవడంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఫలితాలపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా గెలపొందిన అభ్యర్థులు వీరే:

 1. సమ్మెట సుధీర్(కాంగ్రెస్)
 2. తోటకూరి రాజమణి (టిఆర్‌ఎస్‌)
 3. కొండేటి అనిత సత్యం (బిజెపి )
 4. భూక్య శ్రీలత (కాంగ్రెస్)
 5. బానోత్ సునీత శ్రీనివాస్(ఇండిపెండెంట్) గెలుపు
 6. ఆన్‌గోతు తరుణ (టిఆర్‌ఎస్‌)
 7. పాలకుర్తి సుజాత (టిఆర్‌ఎస్‌)
 8. కోదాటి పద్మాదేవేందర్ (టిఆర్‌ఎస్‌)
 9. మంచాల రామకృష్ణ (టిఆర్‌ఎస్‌)
 10. తుమ్మల రవీందర్ (టిఆర్‌ఎస్‌)
 11. కోమడ్ల ఎలెందర్ రెడ్డి(టిఆర్‌ఎస్‌)
 12. పూజారి సుజాత రఘు(టిఆర్‌ఎస్‌)

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/