విజయవాడలో రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్

రేపు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్

అమరావతి: రేపు ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఓటు వేయనున్నారు. పవన్ కల్యాణ్ పటమటలంకలోని కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/