తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముహూర్తం ఖరారు

మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 18న 11.30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/