సిఎం జగన్పై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం అర్థం కావడం లేదు

మాచర్ల: సినీ నటుడు సమన్ మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సిఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని చెప్పారు. రైతులకు మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు యత్నించానని… కానీ అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/