రాజీనామా చేయ‌నున్న ఉత్త‌రాఖండ్ సీఎం !

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర రావ‌త్ రాజీనామా చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఆయ‌న రాజీనామా స‌మ‌ర్పించే అవ‌కాశాలు ఉన్నాయి. డెహ్రాడూన్‌లో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే ఆయ‌న ఢిల్లీలో పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాను క‌లిశారు. ఇవాళ సాయంత్రం గ‌వ‌ర్న‌ర్‌ను సీఎం త్రివేంద్ర రావ‌త్ క‌లిసే అవకాశాలు ఉన్నాయి. బుధ‌వారం రోజున ఎమ్మెల్యేల‌తో క‌లిసి స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బ‌న్సిదార్ భ‌గ‌త్ తెలిపారు. త్రివేంద్ర రావ‌త్ ప‌నితీరుపై అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే ఎన్నిక‌ల్లో త్రివేంద్ర వ‌ల్లే ఓట‌మి ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/