దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ – పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా జగన్ ఫై విమర్శల వర్షం కురిపించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ అంటూ విమర్శించారు. ఆక్సిమొరాన్ అంటే విరుద్ధమైన రెండు పదాల కలయిక. మన సీఎం సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని పవన్ చెప్పుకొచ్చారు. అసలు దేశంలో జగన్ క్లాస్ వేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘లాండ్ నుంచి శాండ్ వరకు.. లిక్కర్ నుంచి మైన్స్ వరకు.. అడవుల నుంచి కొండల వరకు.. పేపర్ నుంచి రెడ్ శాండిల్ వరకు.. ఏపీ నుంచి ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంది.. ఇది నిజంగా క్లాసిక్. ప్రజల జీవితాలు, గౌరవం, కష్టపడటం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయి. మధ్యతరగతి కుటుంబాలు రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ వారిని ట్యాక్స్ చెల్లించేవారిగానే ట్రీట్ చేస్తోంది. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు.. ఇది వైఎస్సార్‌సీపీ మాస్టర్ క్లాస్’ అంటూ మరో ట్వీట్ చేశారు.
వైస్సార్సీపీ ప్రభుత్వం ఆంధ్రాకి పెట్టుబడుల భారీగా తీసుకురాగలిగినప్పుడు దావోస్ ఎవరికి కావాలి. మన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారు.. ఇక ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం వేచి చూడాలి. ఇది కూడా మరో క్లాస్ యాక్ట్. దేశంలోనే ధనవంతుడైన సీఎం అవినీతి ఆరోపణలతో.. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ చారు మంజూదర్‌లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు’ అంటూ సెటైర్లు పేల్చారు. ప్రస్తుతం పవన్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక పవన్ ట్వీట్స్ కు మంత్రి గుడివాడ అమర్ నాధ్ కౌంటర్ వేసాడు. బాబూ నిత్య కల్యాణ్… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్ జీవిత చరిత్ర బాగా చదువుకో! అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పలు ట్వీట్స్ చేసారు.
ఆక్సీ మోరాన్‌కు మరికొన్ని ఎగ్జాంపుల్స్
బీజేపీతో వివాహం… చంద్రబాబుతో సంసారం…
హిందీ అమ్మాయితో పెళ్ళి… రష్యన్‌తో పిల్లలు…
అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు!
ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలు చదివే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం పెట్టటానికి వీల్లేదని… అమరావతి భూముల్ని పేదలకు పంచితే సామాజిక అసమతౌల్యం వస్తుందని వాదించిన బాబు బ్యాచ్‌ది క్లాస్ వార్ కదా?
బాబూ నిత్య కల్యాణ్… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్ జీవిత చరిత్ర బాగా చదువుకో! అంటూ అమర్నాథ్ ట్వీట్ చేశారు.