స్వప్నలోక్‌ అగ్ని ప్రమాదం..మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సిఎం కెసిఆర్‌

మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్‌ః గత రాత్రి సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.