ప్రమాదానికి గురైన హీరో రామ్..

హీరో రామ్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం రామ్ ..తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇందుకోసం తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఎక్స‌ర్ సైజులు చేస్తుండగా ఆయ‌న‌కు మెడ‌కు గాయ‌మైంది. దీంతో షూటింగ్ ఆగిపోయింది. మెడ‌కు బ్యాండేజ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారింది.

‘సీటీమార్’ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ చిట్టూరి రామ్ 19 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గానే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్‌..ఈసారి తమిళ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అందుకోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఇస్టార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో ఇంకా బీస్ట్ లుక్‌లో కనపడాలని రామ్ గట్టిగానే ప్రయత్నిస్తూ.. జిమ్‌లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మెడకు ప్రమాదం చోటుచేసుకుంది.