రేపు గవర్నర్ తమిళసై ని కలవబోతున్న వైఎస్ షర్మిల

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు (గురువారం) తెలంగాణ గవర్నర్ తమిళసై ని కలవబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు షర్మిల..రాజ్ భవన్‭కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తమిళి సైకి వినతిపత్రం అందించనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.

గత నవంబర్‌ 28వ తేదీన వరంగల్‌ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది.దీంతో పోలీసులు మరోసారి షర్మిలకు పాదయాత్ర చేపట్టేందుకు షరుతులతో కూడిన అనుమతి ఇచ్చారు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, , హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది. రోజు మొత్తం కాకుండా ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఇచ్చారు.