నారా భువనేశ్వరిని పరామర్శించిన పవన్ కల్యాణ్

భువనేశ్వరి, బ్రహ్మణిలను కలిసిన పవన్

pawan-kalyan-meets-nara-bhuvaneswari-and-brahmini

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలను జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొంత దూరంలో చంద్రబాబు కుటుంబం బస చేస్తున్న క్యాంప్ కు ఆయన వెళ్లారు. వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో పాటు బాలకృష్ణ, నారా లోకేశ్ కూడా ఉన్నారు. అంతకు ముందు జైల్లో ఉన్న చంద్రబాబును పవన్, బాలయ్య, లోకేశ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ టిడిపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని స్పష్టమైన ప్రకటన చేశారు.