పవన్ కళ్యాణ్ కు ఆ దమ్ము లేదంటూ కొడాలి నాని ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే కేంద్రం ఫై మాత్రం ఆయన ఒక్కమాట అనడంలేదని మంత్రి నాని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదని..కానీ వైసీపీ పై, ముఖ్య మంత్రి జగన్ పై అనేక ఆరోపణలు చేస్తారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై పోరాటం చేయాలని, వారి పై విమర్శలు చేయాలని అన్నారు.
ఇదే క్రమంలో చంద్రబాబు ఫై ఫైర్ అయ్యారు. ‘‘చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వ్యాఖ్యలు చేయకపోయినా చేసినట్లు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఆడవాళ్ళని రోడ్డు మీదకు తెచ్చిన వారికి కూడా ఈ శాపం వర్తిస్తుంది. ఎవరన్నా భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా… ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది. చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది’’ అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ , చంద్రబాబు లపై మండిపడ్డారు.