చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదుః కిషన్ రెడ్డి

హైదరాబాద్: మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం అది కాదని.. ఒకవేళ ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాలని చెప్పారు. ఆ తర్వాత అరెస్టు నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్టులోనూ దర్యాప్తు సంస్థలు అదే విధంగా వ్యవహరించాయన్నారు. ఎక్కడైనా సరే రాజకీయ కక్షలు ఉండొద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు.