పాక్‌ తవ్వకాల్లో బయటపడిన పురాతన హిందూ దేవాలయం

హిందూషాహి రాజులు ఆలయాన్ని నిర్మించి ఉంటారన్న అధికారులు

1300 year old temple of Lord Vishnu found in excavations in Pa

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ లో అత్యంత పురాతనమైన ఆలయం బయటపడింది. పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్లనాటి పురాతన శ్రీ మహావిష్ణువు ఆలయం వెలుగుచూసింది. స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటలీ, పాకిస్థాన్ దేశాలకు చెందిన పురావస్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది. ఈ విషయాన్ని పాక్ పురావస్తుశాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. హిందూషాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెప్పారు. చరిత్ర ప్రకారం క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు పాలించారు. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారు. దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా చెపుతారు. వీరు వాయవ్య భారత ప్రాంతాన్ని పాలించినట్టు కూడా చరిత్రలో ఉంది. ఈ రాజ్యవంశీకులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెపుతున్నారు. మరోవైపు, ఆలయ పరిసర ప్రాంతాల్లో వాచ్ టవర్, జాడలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/