సోము వీర్రాజుకి జన్మదిన శుభాకాంక్షలు

సోము వీర్రాజు నాయకత్వంలోని బిజెపి శ్రేణులతో కలిసి నిరంతరం పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను కొనియాడారు. యువ రాజకీయ వేత్తగా బిజెపిలోకి అడుగుపెట్టి ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన బిజెపితోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆ నిబద్ధతను గుర్తించిన బిజెపి అగ్ర నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తుది వరకు నిలబడతారని, పార్టీకి మంచి ఫలితాలు అందిస్తారని ఆయనను బిజెపి ఏపి అధ్యక్షుడిగా ఎన్నుకుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన, పాలన, విధానపరమైన అంశాలపై పట్టు ఉన్న నేత సోము వీర్రాజని చెప్పారు. ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడానికి వీర్రాజు నాయకత్వంలోని బిజెపి శ్రేణులతో కలిసి నిరంతరం పనిచేస్తామని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/