ఈ నెల 30 వరకు పవన్ కాకినాడలోనే

ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..పూర్తి సమయం రాజకీయాల పైనే పెట్టబోతున్నారు. సరిగ్గా 100 రోజులు కూడా ఎన్నికలకు సమయం లేకపోవడం తో అభ్యర్థుల ఎంపిక..ప్రచార కార్యక్రమాలు , పొత్తుకు సంబదించిన విషయాలు ఇలా అన్ని త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నాడు.

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. ఈ నెల 30 వరకు కాకినాడ లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. అందుకే అక్కడే ఆయన మకాం వేసి పార్టీ నేతలతో చర్చంచనున్నారని చెప్పుకొచ్చారు. సీనియర్ నేతలతో సమావేశమై పొత్తులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కూడా నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.

జనసేనకు అధిక బలం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 నియోజకవర్గాలుండగా, అందులో అత్యధిక స్థానాలను పొత్తులో భాగంగా తాము తీసుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారు.