హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కల్యాణ్ గారు

కుటుంబ, వారసత్వ పార్టీల నుంచి విముక్తి చేద్దాం

somu veerraju

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిబద్ధతను కొనియాడిన విషయం తెలిసిందే. ఆయన నిబద్ధతను గుర్తించిన బిజెపి అగ్ర నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తుది వరకు నిలబడతారని, పార్టీకి మంచి ఫలితాలు అందిస్తారని ఆయనను బిజెపి ఏపి అధ్యక్షుడిగా ఎన్నుకుందని, ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ పవన్ కల్యాణ్ గారు. బిజెపి జనసేన పార్టీలు రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తాయి.. కుటుంబ, వారసత్వ పార్టీల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా పని చేద్దాం’ అని పవన్ కు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/