జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్‌ రెడ్డి ఆగ్రహం

కేంద్రమంత్రి స్థాయిలో పర్యటిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని సీరియస్‌

Kishan-Reddy-visits-flood-areas

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడి హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఈరోజు పరిశీలించారు. వరద బాధిత ప్రాంతాల్లో తన పర్యటన సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నగరంలో తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ లోకేష్ కుమార్‌కు ఫోన్ చేసి అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. నగరంలోని అనేక వరద బాధిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలోనూ ఆయన పర్యటన కొనసాగింది. గురువారం ఉదయం ఖైరతాబాద్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి.

దోమల గూడలోని అరవింద్‌, సూరజ్‌ కాలనీలో పర్యటించి బాదిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఖైరతాబాద్‌ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతితో ఫోన్‌లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కిషన్‌రెడ్డి ముందే బీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు నిలదీశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/