పట్టాభి ఫై వైస్సార్సీపీ ట్రోల్స్

kommareddy pattabhi

టీడీపీ నేత పట్టాభి ఫై నెటిజన్లు, వైస్సార్సీపీ శ్రేణులు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న ఆయన ‘ఈరోజు పేటీఎం, ఫోన్ పే డిజిటల్ పేమెంట్స్ చేయగలుగుతున్నామంటే కొన్నేళ్ల క్రితం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ముందడుగు పడింది’ అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు టార్గెట్ చేశారు. టీడీపీ నేత పట్టాభిని ట్రోల్ చేస్తున్నారు. పేటీఎం, ఫోన్ పేను చంద్రబాబు కనిపెట్టారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పట్టాభి గారు పేటీఎం వచ్చింది 2010 లో Google Pay వచ్చింది 2013లో అంటూ ఒకరు ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చింది 2014లో కదా మరి.. ఆయన వల్ల ఎలా వచ్చిందో కాస్త లాజిక్ చెబుతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.