పుష్ప ఫస్ట్ టాక్ వచ్చేసింది..అభిమానుల సంబరాలు మాములుగా లేవు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్‌ డైరెక్షన్ చేసిన ఈ సినిమా రేపు(డిసెంబర్‌17)న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. దీనికి తోడు బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. పాన్‌ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో ఈ చిత్ర రివ్యూ ఇదే అంటూ దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమర్ సంధు తన రివ్యూ రేటింగ్ ఇచ్చి అభిమానుల్లో సంబరాలు నింపారు.

ఉమర్ సంధు ట్వీట్ ప్రకారం ..పుష్ప ఫస్టాఫ్ రేసీ అండ్ టెర్రిఫిక్‌గా ఉంటుందని.. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్‌తో అల్లు అర్జున్ అదరగొట్టేశాడని.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఊరమాస్‌గా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారని.. నేషనల్ అవార్డ్ రావడం ఖాయమని అన్నారు. ఇంటర్వెల్వ్ ట్విస్ట్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని.. సమంత ఐటమ్ సాంగ్ వెరీ హాట్ అని వింటర్ బ్లాక్ బస్టర్‌ని బాగా ఎంజాయ్ చేయండి అంటూ 4 రేటింగ్ ఇచ్చాడు.

2021లో ది బెస్ట్ ఫిల్మ్ పుష్ఫ అని చెప్తూ.. అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయిందన్నారు. దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే జింగ్ జింగ్ అమైజింగ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక రష్మిక పెర్ఫామెన్స్‌ని కూడా ఆకాశానికి ఎత్తేశారు. మొత్తం మీద పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈయన చెప్పేది కరెక్ట్ నా ..లేదా అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.