ఏపిలో షాపులు తెరిచేందుకు ఉత్తర్వులు జారీ

కంటోన్మెంట్ జోన్లు మినహా షాపులు తెరవచ్చు..ఏపి ప్రభుత్వం

ap state logo
ap state logo

అమరావతి: ఏపిలో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు సండలింపు నేపథ్యంలో కంటోన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చని, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లను మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అనుసరించి గ్రామాల్లో షాపులు, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న షాపులు, అతి తక్కువ పాజిటివ్ కేసులు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వినియోగదారులు, కొనుగోలుదారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజికదూరం పాటించాలని, దుకాణాల వద్ద శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌, బంగారు ఆభరణాలు, వస్త్ర, చెప్పుల దుకాణాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/