నేడు విజయవాడ లో ‘జయహో బీసీ సభ’..వంటకాలు చూస్తే అబ్బా అనాల్సిందే

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జయహో బీసీ సభ ప్రారంభమైంది. ఈ సభ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు హాజరుకాబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మహాసభను ప్లాన్‌ చేసింది వైస్సార్సీపీ. జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు ఛలో విజయవాడకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84 వేల మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతారన్నది సీఎం జగన్‌ ప్రకటిస్తారు.

ఇక ఈ జయహో బీసీ సభకు వచ్చే వారి కోసం పసందైన వంటకాలను సిద్ధం చేశారు. టిఫిన్ లో ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి ఉన్నాయి. భోజనానికి మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యల కర్రీ, చేపల పులుసు, కట్ట, అన్నం, పెరుగు, చక్కెర పొంగలి, వెజ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, బీన్స్ జీడిపప్పు కర్రీ, గోంగూర పచ్చడి, టమాటా పప్పు, సాంబారు, పెరుగు వడ్డిస్తారు.