నిన్న రాత్రి పాతబస్తీ జనాలు నిద్రపోలేదు..ఎందుకంటే

బుధువారం రాత్రి పాతబస్తీ జనాలు నిద్రపోలేదు. భరించలేని వాసన తో ప్రజలు హాస్పటల్ పాలైయ్యారు. వాసన భరించలేక పిల్లలు వాంతులు చేసుకోగా, పెద్దవాళ్లు అనారోగ్యానికి గురయ్యారు. టప్పాచబుత్ర, యూసుఫ్ నగర్, కార్వాన్, నటరాజనగర్, మహేష్ కాలనీ తదితర ప్రాంతాల వాసులు ఈ దుర్వాసనకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు.

దాదాపు గంటన్నర పాటు ఇబ్బంది పెట్టిన దుర్వాసన ఆగిపోయాక జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాసన ఎక్కడి నుంచి వస్తోందనే విషయాన్ని ఎంత ప్రయత్నించినా పోలీసులు కనుక్కోలేకపోయారు. మాములుగా అయితే ఇండస్ట్రియల్ ప్రాంతాలలో పరిశ్రమలలోని రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ఇలా దారుణమైన వాసన వస్తుంటుంది..కానీ పాతబస్తీ ఇలాంటి వాసన రావడం అందర్నీ ఖంగారుకు గురి చేసింది.