మరోసారి పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడిన పోసాని..

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మరోసారి పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడ్డారు. పవన్ లాంటి వ్యక్తి ఆవేశపరుడు రాజకీయాలకు పనికిరాడని..ఊసరవెళ్లి రాజకీయాలను ప్రశ్నిస్తే తప్పా..పవన్ రౌడీయిజం చేస్తున్నారని..మరోసారి ఆగ్రహించారు.

రెండు రోజుల క్రితం పోసాని..ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించిన సంగతి తెలిసిందే. ఈయన వ్యాఖ్యలకు జనసేన కార్య కర్తలు , అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేసారు. ఒకానొక టైం లో ప్రెస్ మీట్ నడుస్తుండగానే పెద్ద ఎత్తున అభిమానులు ప్రెస్ క్లబ్ కు చేరుకొని పోసాని ఫై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటె తాజాగా పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.

అమీర్ పేట లోని ఎల్లారెడ్డిగూడాలో పోసాని ఇంటిపై పవన్ అభిమానుల దాడులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈఘటనపై స్పందించిన పోసాని మళ్లీ పవన్ ఫై విరుచుకపడ్డారు. పవన్ లా నేనెవరిని మోసం చేయలేదని, పవన్ రౌడీయిజం చేస్తున్నారని… పవన్ లాంటి వ్యక్తి ఆవేశపరుడు రాజకీయాలకు పనికిరాడని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ దాడి ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.