చరణ్ తో కలిసి సినిమాలు నిర్మించబోతున్న ప్రభాస్ ఫ్రెండ్

ప్రభాస్ స్నేహితుడు విక్రమ్ ..ఇప్పుడు చరణ్ తో కలిసి సినిమాలు నిర్మించబోతున్నారు. మొన్నటివరకు విక్రమ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సినిమాలు నిర్మించబోతున్నాడట. “వీ మెగా పిక్చర్స్” పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ కొత్త బ్యానర్లో మొదటి సినిమాగా అక్కినేని అఖిల్ సినిమా రానుందట. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని టాక్.

ఇక ఈ సినిమా తరువాత టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణుతో కూడా ఒక సినిమా చేయనున్నారు. అంతేకాదు.. అతి త్వరలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమా కూడా చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నట్లు వినికిడి. మరి యువి క్రియేషన్స్ నుండి విక్రమ్ ఎందుకు బయటకు వచ్చాడో..? లేక ఆ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ..వీ మెగా పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తాడో తెలియాల్సి ఉంది.

ఇక చరణ్ విషయానికి వస్తే..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు.