స్వీయ నిర్బంధంలోకి పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌

Amarinder Singh
Amarinder Singh

చండీఘడ్‌: పంజాబ్ ‌సిఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఈరోజు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. నిన్న(శుక్రవారం) నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు సిఎం నేటి నుంచి 7 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు మీడియా అధికారి రవీన్‌ తుక్రాల్‌ ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కలిపి 29 మంది కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన వారు శాసనసభ సమావేశానికి హాజరు కావొద్దని ముఖ్యమంత్రి కోరారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/