నేడు హైదరాబాద్‌కు రానున్న సిఎం జగన్‌

రేపు ఓ పెళ్లికి హాజరుకానున్న జగన్

AP CM YS Jagan-
AP CM YS Jagan-

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకునే ఆయన, నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారని సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రేపు హైదరాబాద్ లో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. ఆపై సాయంత్రం తిరిగి గన్నవరం చేరుకుని, నేరుగా తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/