చార్మినార్ వద్ద షాపింగ్ చేసిన జూ. ఎన్టీఆర్ భార్య ప్రణతి

జూ. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతికి కోట్ల ఆస్థి ఉన్నప్పటికీ..ఓ సాధారణ గృహిణి లా వ్యవహరిస్తుంటుంది. పెద్దగా ఆడంబరాలు లేకుండా చాల సింపుల్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె చార్మినార్ వద్ద సందడి చేసింది. రంజాన్ మాసం కావడం తో చార్మినార్ వద్ద ప్రణతి షాపింగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక సామాన్యమైన వ్యక్తిలా చార్మినార్ కు వచ్చి ఆమె షాపింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ చూసి ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30 మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీనికి సంబదించిన కొన్ని పిక్స్ బయటకు వచ్చి అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా , అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.